వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి..షెడ్యూల్‌ ఇదే

-

వేములవాడకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వేములవాడ సభలో పాల్గొంటారు. ఈ తరునంలోనే గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth to Vemulawada on 20th of this month

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం రూ.85 లక్షలు కేటాయించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… కాంగ్రేస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయ హస్తం’ లో  ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరియు ఎన్నారైల సంక్షేమం’ కోసం హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే… ‘గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరియు ఎన్నారైల సంక్షేమం’ చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకంలో భాగంగానే… వేములవాడ సభలో గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news