సర్పంచులకు గౌరవ వేతనం ఈనెల (మార్చి) నుంచి వారి ఖాతాల్లోనే జమ కానుంది. ఇందుకు ఉమ్మడి జిల్లా పంచాయతీ విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి ఎంపీడీవోలకు నిధులిస్తే, వారు పంచాయతీ ఖాతాలకు బదిలీ చేసేవారు. అక్కడి నుంచి చెక్కుల ద్వారా సర్పంచులు వేతనాలు తీసుకోవాల్సి వచ్చేది. అవీ రెండు, మూడు నెలలకోసారి వచ్చేవి. ఈసమస్యను తీర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికారులు తెలిపారు.