మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… భువనేశ్వర్‌లోని ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాల లోకి వెళితే.. జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)–02, ప్రాజెక్ట్ అసోసియేట్–02, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌లు–01 ఖాళీలు ఉన్నాయి.
ఇక అర్హతల వివరాల లోకి వెళితే.. గ్రాడ్యుయేషన్/డిప్లొమా, ఎంఈ/ఎంటెక్ ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే నెట్/గేట్ అర్హత ఉండాలి. అలానే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థులను మొదట అకడమిక్ అర్హత ఉధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఆ తరవాత ఇంటర్వ్యూని నిర్వహిస్తారు. శాలరీ విషయానికి వస్తే.. జేఆర్‌ఎఫ్,ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.31,000తో పాటు హెచ్‌ఆర్‌ఏ, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.20,000 జీతంగా చెల్లిస్తారు. అప్లై చేసుకోవాలనుకునే వారు 14-03-2022 లోగా అప్లై చేసుకోవాలి.
దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: ది ఇంచార్జ్–అడ్మినిస్ట్రేషన్, సీపెట్: ఎస్‌ఏఆర్‌పీ–ఎల్‌ఏఆర్‌పీఎం, బీ–25, సీఎన్‌ఐ కాంప్లెక్స్, పాటియా, భువనేశ్వర్–751024, ఒడిశా.