న్యూజీలాండ్ వేదికగా మహిళ క్రికెట్ ప్రపంచ కప్ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగ ఈ మెగా టోర్నీలో నేడు టీమిండియా, పాక్ ను ఢీ కొడుతుంది. ఈ రోజు ఉదయం 6 :30 గంటల కే మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ కు దిగింది. కాగ టీమిండియా మ్యాచ్ ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ బ్యాటర్ షఫేలి వర్మ డౌకట్ గా పెవిలియన్ చేరింది.
కాగ ప్రస్తుతం 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన భారత్.. కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగ ప్రస్తుతం స్మృతీ మందన్న (12), దీప్తీ శర్మ (3) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కాగ ఇండియా, పాక్ ల మధ్య మ్యాచ్ అంటే… తీవ్ర ఉత్కంఠ గా ఉంటుంది. మెన్స్ క్రీకెట్ అయినా.. ఉమెన్స్ క్రికెట్ అయినా.. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తుంది.
కాగ ఈ మెగా టోర్నీలో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో.. ఉత్కంఠ మరింత గా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి.. పాక్ పై, ఈ మెగా టోర్నీ పై పై చేయి సాధించాలని టీమిండియా భావిస్తోంది.