ప్రైవేట్ మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులను తొలగించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ వైద్యులే నేరుగా బ్రాండ్ పేర్లతో… బయటి మెడికల్ షాపులకు రాస్తున్నారు. ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారడమే కాకుండా.. ఆర్థిక భారం పడుతుంది. మెడికల్ షాపులతో వైద్యులు కుమ్మక్కై ఈ పరిస్థితి తలెత్తిందని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వం ఆస్పత్రుల ఆవరణలో ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులను తొలగించనున్నారు. వచ్చే నెల నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. మార్చి నెలలో వేరే ఏరియా చూసి.. మెడికల్ షాపులు పెట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.