తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ లపై అసెంబ్లీ లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బిజెపి ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించిన తెలంగాణ హైకోర్టు.. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టును కోరాడు.
వారి పై సస్పెన్షన్ వేయడం ప్రజల గొంతు నొక్కడమే అని హైకోర్టు కు తెలిపారు. అయితే పిటిషన్ను తరపు లాయర్ చెప్పిన వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు… బీజేపీ ఎమ్మెల్యేల కు ఊహించని షాక్ ఇచ్చింది. అసెంబ్లీ సస్పెన్షన్ పై తాము ఎలాంటి సహాయం చేయబోమని… స్టే కూడా ఇచ్చే అవకాశం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల కు షాక్ తగిలింది.