బాహుబలి-3 పై రాజమౌళి క్లారిటీ… త్వరలోనే ఆసక్తికర వార్త అంటూ…

-

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా బాహుబలి. బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల్లోనూ రికార్డ్ కలెక్షన్లతో సత్తాచాటింది. బాహుబలి 1,2 చిత్రాలు బాలీవుడ్ కు తెలుగు సినిమా సత్తాను చూపించాయి. ఇదిలా ఉంటే బాహుబలి -3 ఉంటుందా.. అంటూ చాలా సార్ల మీడియా రాజమౌళిని ప్రశ్నించింది. ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లలో కూడా ఈ ప్రశ్నను ఎదర్కొన్నాడు రాజమౌళి. దీనిపై నేను స్పందిస్తే.. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ పక్కకు పెట్టి బాహుబలినే హైలెట్ చేస్తారంటూ.. ఫన్నీగా కామెంట్లు కూడా చేశారు. 

ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు రాజమౌళి. బాహుబలి-3పై క్లారిటీ ఇచ్చారు. బహుబలికి థర్డ్ పార్ట్ తీసే ఆలోచనలో ఉన్నట్లు రాజమౌళి తెలిపారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళిని యాంకర్ బాహుబలి 3 గురించి ప్రశ్నించారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ… బహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించున్నాం, దీనిపై వర్క్ చేస్తున్నాం అంటూ సమాధానం ఇచ్చారు. బాహుబలి-3పై నిర్మాత శోభు కూడా సుముఖంగా ఉన్నారని రాజమౌళి అన్నారు. దీన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ బాహుబలి నుంచి ఆసక్తికర వార్త రానుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news