తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆవుని రాజ్యమాతగా ప్రకటించింది. భారతీయ సంప్రదాయంలో ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏక్నాద షిండే నేతృత్వంలో ప్రభుత్వం ఆవుని రాజమాతగా ప్రకటించారు. పురాతన కాలం నుంచి మనం గోవును పూజిస్తున్నాము. ఆవుని పూజించడం వలన ఎన్నో లాభాలను పొందవచ్చు. పైగా ఆవు పాలు కూడా ఆరోగ్యమే.
భారతదేశం అంతటా కనపడే వివిధ జాతుల ఆవులను హైలెట్ చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీ ఆవుల సంఖ్య తగ్గడం పై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడ యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించింది. దాని ద్వారా మానవులు పోషకాహారాన్ని తీసుకుంటారని వివరించారు.
ఆవు అందించే ఉత్పత్తుల గురించి, వాటికి సంబంధించిన సామాజిక ఆర్థిక అంశాలతో పాటుగా ఆవులను పెంచడానికి పశువుల పెంపక ప్రభుత్వం ప్రోత్సహించింది. భారతదేశంలో ఆవుకి తల్లి హోదా ఇవ్వబడింది. ఆవు హిందూమతంలో పూజించబడుతుంది ఆవు పాలు మానవ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఆవు మూత్రం కూడా అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది.