ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ దక్కించుకున్న తర్వాత.. ఎయిర్ ఇండియాను డెవలప్ చేయడానికి టాటా గ్రూప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా కు సీఈవో గా టార్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మెన్ ఇల్కర్ అయిసీని నియమించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి అయిసీ అంగీకరించకపోవడం ఆ ప్రక్రియా ఆగిపోయింది. ప్రస్తుతం కొత్త సీఈవో కోసం ఎయిర్ ఇండియా చూస్తుంది.
అతి త్వరలోనే ఎయిర్ ఇండియా తమ కొత్త సీఈవో పేరు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాగ తాజా గా ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా మోటర్స్, టాటా పవర్, టీసీఎస్ కంపెనీలకు చైర్మెన్ గా వ్యవహరిస్తున్న చంద్ర శేఖరన్ ను ఎయిర్ ఇండియాకు కూడా చైర్మెన్ గా నియమించింది.
అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ సీఎండీ గా వ్యవహరిస్తున్న ఆలైస్ గీ వర్గీస్ వైద్యన్ ను బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా నియమించనుంది. కాగ దీని కోసం ఎయిర్ ఇండియా బోర్డు ఆమోదం కూడా తెలిపింది.