తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్ లోనే చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు పంపించింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో పలు చోట్ల ఈ ఆన్ లైన్ మూల్యాంకనం అనే పద్ధతి వచ్చింది. దీంతో తొలి సారి తెలంగాణ రాష్ట్రంలోనూ ఆన్ లైన్ మూల్యాంకనం పద్దతిని ప్రయోగాత్మకంగా ప్రాంరభించాలని ప్రయత్నిస్తుంది. కాగ ఆన్ లైన్ మూల్యాంకనం వల్ల అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి.
అందులో.. జవాబు ప్రతంలో మార్కుల మొత్తం కూడికలో తప్పులు ఉండవు. అలాగే ఒక పేజీని దిద్దకుండే సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉండదు. జవాబు పత్రాలను స్కాన్ చేసిన ఉపాధ్యాయుడికే పంపింస్తారు. ఉపాధ్యాయులు తమ కంప్యూటర్ లలో మూల్యాంకనం చేయవచ్చు.
అలాగే పలితాలు వచ్చిన రోజే.. జవాబు పత్రాలను కూడా విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మూల్యాంకనం విషయంలో విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగిన సులువుగా తెలుస్తుంది. కాగ గతంలో జవాబు పత్రం పొందాలంటే.. రూ. 600 ప్రభుత్వానికి కట్టాల్సి ఉండేది. కాగ ఇప్పుడు ఆన్ లైన్ మూల్యాంకనం ప్రారంభం అయింతే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.