హైదరాబాద్ చుట్టు నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు కు మార్గం సుగమం అయింది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మరో కీలక అడుగు ముందుకు పడింది. ఆర్ఆర్ఆర్ కోసం భూ సేకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అంతే కాకుండా.. ఆర్ఆర్ఆర్ వెళ్లే జిల్లాల వారీగా భూ సేకరణ కోసం ప్రత్యేక అధికారులను సైతం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. భూ సేకరణకు నియమించిన అధికారులు కింది స్థాయి వరకు వెళ్లి పరిశీలన చేపడుతారు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చోప్పున, సిద్ధిపేట్ జిల్లాలో ఒక బృందం, యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు బృందాల చోప్పున మొత్తం ఎనిమిది బృందాలు భూ సేకరణ కోసం పని చేయనున్నాయి. కాగ రీజనల్ రింగ్ రోడ్డును 344 కిలో మీటర్ల మేర రెండు భాగాలకు నిర్మించనున్నారు. అయితే 158.50 కిలో మీటర్ల ఉత్తర భాగానికి జాతీయ రహదారి హోదాను కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
అంతే కాకుండా దానికి 161 (ఎ) (ఎ) అనే నంబర్ ను కూడా కేటాయించింది. కాగ ఈ ఆర్ఆర్ఆర్ ను ముందుగా నాలుగు నిర్మిస్తారు. అనంతరం మరో నాలుగు వరుసలు నిర్మించడానికి అనువుగా మొత్తం 100 మీటర్ల వేడల్పుతో భూ సేకరణ చేయనున్నారు.