రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మరో సారి ముందుకు వచ్చింది. ఈ సారి రూ. 8,357 కోట్లను వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగ దీనికి కేంద్ర రక్షణ శాఖ కూడా ఆమోదం తెలిపింది. కాగ దేశంలో త్రివిద దళాలను ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్, జీ శాట్ – 7 బీ శాటిలైట్ తో పాటు మరి కొన్ని రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రూ. 8,357 కోట్లను కేంద్రం కేటాయించింది.
దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. వీటిని కొనుగోలు చేయడం వల్ల.. భారత రక్షణ శాఖ సామర్థ్యం మరింత పెరుగుతందని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. అలాగే ఈ ఉత్పత్తులను అన్ని కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ తెలిపింది.