బోయిగూడ అగ్ని ప్రమాదం…. మృతులు వీళ్లే

-

హైదరాబాద్ బోయిగూడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టింబర్, స్క్రాప్ డిపోలో చెలరేగిన మంటలతో 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. తెల్లవారుజాములు టింబర్ డిపోలో మంటలు చెలరేగుతున్నాయి. మొత్తం 12 మంది కార్మికుల్లో ఇద్దరిని అధికారులు కాపాడారు. మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్య్కూ ఆపరేషన్ చేపడుతున్నారు అధికారులు. రాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. షాట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం చెలరేగిందని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మంటలు అదుపు చేయడానికి 3-4 గంటలు పట్టిందని అధికారులు తెలుపుతున్నారు. అయితే షాట్ సర్క్యూట్ కారణమా…మరేదైనా కారణమా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో 12 మంది కార్మికులు ఉంటే ఒక్కరు మాత్రం గోడదూకి ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది. ప్రమాదంలో మరణించిన కార్మికుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివారాల ప్రకారం… బిట్టు, సికిందర్, దామోదర్, దినేష్, చింటు, రాజేష్, రాజు, దీపక్, పంకజ్, సికిందర్ ఉన్నారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదం నుంచి గోలు అనే వ్యక్తి బయటపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news