నేడు యూపీ సీఎంగా యోగి ప్ర‌మాణ‌స్వీకారం.. అంబానీ, అదానీ హాజ‌రు

-

ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా యోగి ఆతిత్య‌నాథ్ నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇటీవ‌ల ఉత్త‌ర ప్ర‌దేవ్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి వ‌స్తుంది. కాగ ఈ రోజు ఉత్త‌ర ప్ర‌దేవ్ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్య నాథ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రంలోని ఎకానా స్టేడియంలో యోగీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

yogi-adityanath
yogi-adityanath

ఈ కార్యక్ర‌మానికి దాదాపు 20 వేల మంది హాజ‌రు అవుతున్న‌ట్టు తెలుస్తుంది. అందులో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు అంబానీ, అదానీ కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. అలాగే ఈ ప్ర‌మాణ స్వీకార కార్యక్ర‌మానికి ముఖ్య అతిథిగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హాజ‌రు అవుతున్నారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్ర‌లు కూడా హాజ‌రు కానున్నారు. అలాగే బాలీవుడ్ ప్ర‌ముఖులు, అక్షయ్ కుమార్, కంగ‌నా ర‌నౌత్, అజ‌య్ దేవ‌గ‌న్ తో పాటు ది క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి కూడా హాజ‌రు అవుతున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news