కోర్టు ఎదుట లొంగిపోయిన లాలూ

-

కోర్టు ఆదేశాలను పాటిస్తా..

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను పాటిస్తానని, హైకోర్టు తీర్పుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు…

దాణా స్కామ్ లో లాలూ నిందితుడిగా తేలడంతో రాంచీ సీబీఐ కోర్టు ఆయనకు శిక్ష విధించింది. దీంతో జైల్లో ఉన్న లాలూ అనారోగ్యానికి గురి కాగా మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.. ఆతర్వాత ఆరోగ్య కారణాల రీత్య పెరోల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించారు. లాలూ నివేదనను పరిశీలించిన కోర్టు మే 11న తొలిసారి ఆయనకు 6 వారాల ప్రొవిజనల్ బెయిల్ని మంజూరు చేసింది. ఆతర్వాత పెరోల్ని పొడగిస్తూ కోర్టు అనుమతించింది.

లాలూ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని..  ప్రస్తుతం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు లాలూ తరుఫు న్యాయవాదులు కోర్టులో విన్నవించి.. పెరోల్ని మరో మూడు నెలలపాటు పొడగించమని కోరారు. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించి పెరోల్ పొడగించేది లేదని, ఈ నెల 30లోగా తిరిగి జైలుకు రావాలని కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news