సమర శంఖం మోగిస్తున్న ‘యాత్ర’

-

మహానటి సినిమాతో బయోపిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సెట్స్ మీద ఎన్.టి.ఆర్, బయోపిక్ తో పాటుగా వైఎస్సార్ బయోపిక్ యాత్ర కూడా షూటింగ్ జరుపుకుంటుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న వైఎస్సార్ బయోపిక్ కు యాత్ర అని టైటిల్ పెట్టారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్సార్ గా నటించబోతున్నాడు. 2019 మొదట్లోనే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా నుండి మొదటిగా రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేయగా సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి నాడు సినిమాలోని సమర శంఖం సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట.

వైఎస్ పాదయాత్ర నేపథ్యంతో ఈ యాత్ర తెరకెక్కుతుంది. కచ్చితంగా వైఎస్ అభిమానులందరికి ఈ సినిమా నచ్చేలా రూపొందిస్తున్నారు. సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా ప్యాడింగ్ యాక్టర్స్ చేస్తున్నారని తెలిసిందే. మరి యాత్ర సమర శంఖం ఎలా ఉండబోతుందో చూడాలి. 2వ తారీఖు ఉదయం 7 గంటలకే ఈ పాట రిలీజ్ అవుతుందని నిర్మాలు ఎనౌన్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news