నూతన జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం

-

నూతన జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం

తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం ఉదయం రాష్ట్రపతి సంబంధిత దస్త్రంపై సంతకం చేసిన అనంతరం కేంద్ర హోంశాఖ ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల కు అంగీకారం తెలుపుతూ  గెజిట్ ను విడుదల చేసినట్లు  అధికారులు తెలిపారు. కొత్త జోనల్ విధానంతో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.

రాష్ట్రపతి నిర్ణయంతో తెలంగాణలో దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి సర్వీస్ నిబంధనలను వాటి ప్రకారం మార్చుకుని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఇప్పటికే అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వూలు జారీ చేశారు.

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ..నీళ్లు- నిధులు- నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కన్న కలలను సాధించే దిశగా ముందుకు అడుగులేస్తోంది అనడానికి నిదర్శనం.   సీఎం కేసీఆర్ తెలంగాణకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను గత వారం ఢిల్లీలో రెండు రోజుల పాటు ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news