అదిరే ఈ LIC పాలసీతో మూడు లక్షలు…. కేవలం వారికి మాత్రమే…!

-

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తోంది. దీనితో మంచిగా లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా అతి పెద్ద జీవితబీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ పాలసీలని ప్రవేశపెట్టి వారి కుటుంబాలకి అండగా నిలుస్తోంది. పైగా ఇందులో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు.

LIC
LIC

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌ఐసీ మహిళల కోసం కూడా ఒక ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. అదే ఎల్‌ఐసీ ఆధార్ శిలా. ఇది కేవలం మహిళలకి మాత్రమే. ఇక ఈ పాలసీకి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన మహిళలు ఈ పాలసీ తీసుకొచ్చు. ఒకవేళ కనుక పాలసీదారు మరణిస్తే బీమా డబ్బులను నామినీకి ఇస్తారు.

ఒకవేళ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే పాలసీ డబ్బులు వారికే అందిస్తారు. ఇక డబ్బులు ఎలా వస్తాయి అనేది చూస్తే.. మహిళలు 31 ఏళ్ల వయసులో రూ.3 లక్షల మొత్తానికి ఈ పాలసీ తీసుకుంటే సంవత్సరానికి దాదాపు రూ.10,700 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

దీని కోసం మీరు రూ.29 ఆదా చేస్తే చాలు. మెచ్యూరిటీ సమయంలో రూ.3.97 లక్షలు వస్తాయి. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోచ్చు. గరిష్టంగా రూ.3 లక్షల వరకు మొత్తానికి పాలసీ తీసుకోచ్చు. ఇన్సూరెన్స్‌ కవరేజీ తో పాటు రాబడి వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news