మార్చి 29వ తేదీన రాజ స్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 61 పరుగులతో.. ఓటమి పాలైంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే.. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్… అవుట్ అవడం.. పెద్ద వివాదంగా మారింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని కేన్ డిఫెన్స్ చేశాడు.
అయితే.. ఆ బంతి కుడి వైపు స్లిప్స్ లో గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ సంజు శాంసన్ కుడివైపు డైవ్ చేసినప్పటికీ.. బంతిని అందుకోలేక పోయాడు. తొలుత అతని గ్లోవ్స్ లో పడి మళ్లీ గాల్లోకి లేచిన బంతిని స్లిప్స్ లో ఉన్న దేవ్ దత్ పడిక్కల్ ముందుకు డైవ్ చేస్తూ.. క్యాచ్ పట్టాడు.
అతడి చేతుల్లోకి వెళ్లక ముందే.. ఆ బంతి గ్రౌండ్ ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే.. థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడాన్ని హైదరాబాద్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు.. దీనిపై బీసీసీఐకి కూడా లేఖ రాసింది సన్‌రైజర్స్. అయితే.. దీనిపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.