ఖాలీగా ఉన్న స్థానిక సంస్థ ప‌ద‌వుల‌కు త్వ‌ర‌లో ఎన్నిక‌లు : ఎస్ఈసీ

-

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల‌లో ఖాలీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్ తో పాటు వార్డు స‌భ్యులు, కౌన్సిల‌ర్, కార్పొరేట్ స్థానాల‌కు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాని కోసం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిషన్ క‌స‌ర‌త్తులు ప్రారంభిస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, మున్సిప‌ల్ క‌మిషన‌ర్ల‌తో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిషన‌ర్ పార్థ సార‌థి వీడియో కాన్ఫ‌రేన్స్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు.

ఈ నెల 8న ముసాయిదా జాబితాలు ప్రచురించాలన్న జిల్లా కలెక్ట‌ర్ల‌కు ఎస్ఈసీ పార్థ సార‌థి సూచించారు. అలాగే ఈ నెల 24న ఓటర్ల తుది జాబితా విడుదల చేయ‌నున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిషన‌ర్ పార్థ సార‌థి తెలిపారు. ఓట‌ర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండాల‌ని సంబంధిత అధికారుల‌కు ఎన్నిక‌ల క‌మిషన‌ర్ పార్థసారథి సూచించారు.

ఓటర్ల జాబితా వచ్చాక పోలింగ్ స్టేషన్ల ఖరారుకు షెడ్యూల్ ఇస్తామని వివరించారు. అనంత‌రం ఈ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకుంటామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news