IPL SRH vs LSG : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న స‌న్ రైజ‌ర్స్ … ఇరు తుది జ‌ట్లు ఇవే

-

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్ ముంబై న‌గ‌రంలోని డీవై ప‌టేల్ స్టేడియం జ‌రుగుతుంది. కాగ ఈ మ్యాచ్ ముందు టాస్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నెగ్గింది. దీంతో కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మొదట‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెఎల్ రాహుల్ సార‌థ్యంలోని లక్నో సూప‌ర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నున్నారు. స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఇప్ప‌టికే ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోయింది.

అలాగే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు.. రెండు మ్యాచ్ లు ఆడింది. అందులో ఒక మ్యాచ్ లో విజ‌యం సాధించి… మ‌రో మ్యాచ్ లో ఓడిపోయింది. కాగ ఈ మ్యాచ్ లో ఇరు జ‌ట్లు కూడా విజ‌యం సాధించాల‌ని ప్ర‌ణాలిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ది జ‌ట్లు ఇలా ఉన్నాయ‌.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తుది జ‌ట్టు :
కేన్ విలియమ్సన్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ ( వికెట్ కీప‌ర్ ), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తుది జ‌ట్టు :
కెఎల్ రాహుల్ ( కెప్టెన్ ), క్వింటన్ డి కాక్ ( వికెట్ కీప‌ర్ ), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news