ఆంధ్ర ప్ర‌దేశ్ ముగిసిన క‌రోనా వ్యాప్తి.. నేడు ”ఒక్క” కేసు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి దాదాపు ముగిసింది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గుతూ వ‌చ్చింది. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయింది. తాజా గా కేవ‌లం ఒక్క కేసు మాత్ర‌మే వెలుగు చూసింది. కాగ కాసేప‌టి క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు… క‌రోనా వైర‌స్ బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,726 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

ఈ పరీక్షల‌లో కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. తూర్పు గోదావ‌రి జిల్లా వాసికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. 2,726 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షల‌లో కేవ‌లం ఒక్క కేసు మాత్ర‌మే వెలుగు చూడ‌టంతో ఏపీలో క‌రోనా వైర‌స్ ఖ‌తం అయిన‌ట్టే అని అధికారులు అభిప్రాయ ప‌డుతున్నారు. కాగ ఈ రోజు రాష్ట్రంలో 32 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 119 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా రాష్ట్రంలో కరోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news