రియల్‌మీ నుంచి మరో ట్యాబ్లెట్‌ను విడుదల అయింది.. Realme Pad Miniని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయిన ఈ బడ్జెట్ ట్యాబ్.. త్వరలో భారత్‌కు వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన రియల్‌మీ ప్యాడ్‌కు లైటర్ వెర్షన్‌గా ఈ కొత్త Realme Pad Mini అడుగుపెట్టింది. దీని ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి.
Realme Pad Mini ధర:
వైఫై + 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో రియల్‌మీ ప్యాడ్ మినీ ట్యాబ్లెట్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.
3జీబీ ర్యామ్ + 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధర ఫిలిప్పీన్స్‌లో 9,990 పెసోలు (సుమారు రూ.14,700)గా ఉంది.
4జీబీ + 64జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర 11,900 పెసోలు (దాదాపు రూ.17,600)గా ఉంది.
బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది.
Realme Pad Mini హైలెట్స్ :
8.7 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, అల్యూమినియమ్ అలాయ్ యునిబాడీతో రియల్‌మీ ప్యాడ్ మినీ వస్తోంది.
రియల్‌మీ ప్యాడ్ 10.4 ఇంచుల స్క్రీన్ కలిగి ఉండగా.. దానికి ఈ కొత్త ట్యాబ్లెట్ లైట్ వెర్షన్‌గా రానుంది.
Realme Pad Mini ట్యాబ్‌లో Unisoc T616 ప్రాసెసర్ ఉంది. గరిష్ఠంగా 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అయితే మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను పొడిగించుకోవచ్చు.
రియల్‌మీ ప్యాడ్ మినీలో 6,400mAh బ్యాటరీ ఉండగా.. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 4జీ ఎల్‌టీఈ, వైఫైతో పాటు బ్లూటూత్, జీఎస్ఎం, WLAN కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
కెమేరా విషయానికి వస్తే.. ఈ ట్యాబ్ వెనుక 8 ఎంపీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. రెండు స్టీరియో స్పీకర్లు, ఓ మైక్రోఫోన్‌ను ఈ ట్యాబ్ కలిగి ఉంది.
మొత్తంగా ఈ ట్యాబ్లెట్ 7.59 మిల్లీమీటర్ల మందం, 372 గ్రాముల బరువు ఉంటుంది.
ఫీచర్స్ నచ్చితే లిస్ట్ లో చేర్చేసుకోండి మరీ..!