IPL 2022 : బీసీసీఐకి బిగ్‌ షాక్‌..33 శాతం తగ్గిన ఐపీఎల్‌ వీక్షకుల సంఖ్య

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మార్చి 26 వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్‌ మెగా టోర్నీలో ఇప్పటికే 16 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్‌ వీక్షకుల సంఖ్య విపరీతంగా తగ్గి పోయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే.. మొదటి వారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడి పోయింది.

బార్క్‌ నివేదిక ప్రకారం.. నిరుడు తొలి 8 మ్యాచ్‌ లకు 3.75 టీవీ రేటింగ్‌ లభించగా.. ఈ సారి ఆ సంఖ్య 2.52 కే పరిమితమైంది. 2022 లో తొలి వారం మ్యాచ్‌ లకు 3.85 టీవీ రేటింగ్‌ వచ్చింది. 2023 – 2027 ప్రసార హక్కులకు భారీ మొత్తం బిడ్డింగ్‌ వస్తుందని ఆశిస్తున్న బీసీసీఐ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు డిస్నీ స్టార్‌, టీవీ 18-వయాకామ్‌, అమెజాన్‌, సోనీ సంస్థలు టెండర్‌ పత్రాలను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో బీసీసీకి వ్యూయర్స్‌ సమస్య పట్టుకుంది.

కాగా… ఇవాళ ఐపీఎల్‌ లో రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 17వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ మధ్య 18వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news