పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ ఓటీటీ రోజురోజుకూ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కంటెస్టెంట్స్ గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. కెప్టెన్సీ టాస్క్ తో పాటు ‘బిగ్ బాస్’ ఇచ్చిన ప్రతీ టాస్క్ ను బాగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ తమకంటూ ప్లాన్స్ కూడా వేసుకుని, ఇతరులతో డీల్స్ కూడా కుదుర్చుకుంటున్నారు.
‘బిగ్ బాస్’ షో అప్పుడే ఆరో వారంలోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఇప్పటికే పూర్తియిన ఓటింగ్ ప్రకారం.. చివరి రెండు స్థానాల్లో శ్రవంతి, ముమైత్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో మాదిరిగా ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనేది చెప్పలేం.
ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ముమైత్ ఖాన్ మాత్రమే ఎలిమినేట్ కావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీబీ లవర్స్ సైతం ముమైత్ ఖాన్ బయటకు వెళ్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. అవసరం లేకున్నా ప్రతీ సారి విపరీతమైన రియాక్షన్స్ తో ముమైత్ ఖాన్ చంపేస్తుందని అంటున్నారు. ఈ మేరకు కొందరు బీబీ లవర్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో అయితే పంచుకుంటున్నారు.
చివరి రెండు స్థానాల్లో శ్రవంతి, ముమైత్ ఖాన్ ఉండగా, డబుల్ ఎలిమినేషన్ చాన్సెస్ ఉంటే వీరిరువురు ఎలిమినేట్ కావచ్చు. ఒకవేళ ఫేక్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఆ చాన్సెస్ హమీదకు ఉండొచ్చని కూడా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ‘బిగ్ బాస్’ ఓటీటీలో మొత్తం 12 వీక్స్ ఉండగా, ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని కూడా పలువురు అంటున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.. ప్రజెంట్ బీబీలో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.