పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. పాక్ జాతీయ అసెంబ్లీలో శనివారం రాత్రి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. ఓటింగ్ ను కూడా నిర్వహించారు. ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. శనివారం రాత్రి నడిచిన హై డ్రామా మధ్య ఇమ్రాన్ ప్రభుత్వం కుప్ప కూలింది. గంట గంటకు ఒక ట్వీస్ట్, మలుపులు, నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఇమ్రాన్ ప్రభుత్వం.. జాతీయ అసెంబ్లీలో తెలిపోయింది. అవిశ్వాసం నుంచి తప్పించుకోవడానికి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రయత్నాలు అన్ని బెడిసి కొట్టాయి.
అనేక పర్యావసనాల మధ్య పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగగా.. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 174 ఓట్లు వచ్చాయి. 342 సభ్యులు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా 174 మంది ఓట్లు వేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్ప కూలింది. పాకిస్థాన్ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానంతో పదవీ కోల్పోయిన ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్.. చెత్త రికార్డును సృష్టించాడు.
కాగ నేడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. విదేశీ డబ్బుల వ్యవహారంలో ఇమ్రాన్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే పాక్ కొత్త ప్రధాని గా షాబాజ్ షరీఫ్ ఎన్నిక అయ్యే అవకాశం ఉంది. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.