చంద్రబాబులో మానవత్వం లేదు.. మనిషి కాదు.. ఒక క్రూరుడు : విజయసాయిరెడ్డి

-

జగన్ ను తొలగించు కోవాలనే విషయంపై ఎప్పటి నుంచో చంద్రబాబు కుట్ర పన్నారని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ…“చంద్రబాబు ఒక విషయం చెప్పారు. జగన్ ను ఇక్కడి నుంచి లేపేస్తే ఏం చేసుకుంటాడని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబులో మానవత్వం లేదు.. మనిషి కాదు. ఒక క్రూరుడు ఒక మృగం లాంటివాడు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలో తల్లి తండ్రిని విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా చంద్రబాబు అన్యాయం ఆరోపించారు. చంద్రబాబు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య మైన వంగవీటి రంగాను హత్య చేయించారు. ఐ.ఏ.ఎస్.అధికారి రాఘవేంద్ర రావు.. చెరుకూరి నారాయణ రెడ్డి లను హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు. కారంచేడు..గంగ పర్రుల లో దళితులను ఊచ కోత కోయించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news