ఈటివిలో గురు, శుక్రవారాల్లో వచ్చే జబర్దస్త్ షో ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. ఈటివి టి.ఆర్.పి రేటింగ్స్ గత ఐదేళ్లుగా పదిలంగా ఉంచుతున్న సీరియల్స్ తో పాటుగా జబర్దస్త్ కూడా ఒకటి. జబర్దస్త్ వల్ల ఈటివి ఇంకాస్త పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే ఆ షో ద్వారా కమెడియన్స్ జీవనోపాది పొందుతున్నారు. అయితే వారిప్పుడు సెలబ్రిటీ స్టేటస్ లోకి వెళ్లారనుకోండి.జబర్దస్త్ షో జడ్జులుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తున్నారు. ఆ షో నిలబడడానికి వారి జడ్జ్ మెంట్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇదిలాఉంటే ఎలక్షన్స్ టైంలో నాగబాబు, రోజా ఇద్దరు తమ జడ్జ్ పొజిషన్ ఖాళీ చేసి వెళ్లారు.
మళ్లీ వస్తారో లేదో తెలియదు కాని అందాకా రోజా స్థానంలో జడ్జ్ గా ఉండమని సీనియర్ యాక్ట్రెస్, సహజ నటి జయసుధని అడిగారట. అయితే తనకు అలాంటి షో సూట్ అవదని.. కాస్త వల్గర్ కామెడీ కూడా ఉంటుంది కాబట్టి తాను జడ్జ్ మెంట్ చేయలేనని చెప్పిందట. జయసుధ కాదన్న ఆ షో జడ్జ్ గా రోజా స్థానంలో మీనా ప్రత్యక్షమయ్యారు. నాగబాబు బదులుగా శేఖర్ మాస్టర్ కనిపించారు. మరి వీరిద్దరు ఎప్పటిదాకా ఉంటారో కాని జబర్దస్త్ ఈ కొత్త జడ్జుల సందడి బాగానే ఉంది.