ఎన్నికలు ముగిసాయి.. ఫలితాల కోసం ఒక నెలరోజులు ఆగల్సిన పరిస్థితి.. సమయం దొరికింది కదా రాజకీయ నాయకులు కుటుంబంతో గడపుతున్నారు. గత ఆరు నెలల నుండి ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికలతో బిజీ బిజీగా గడిపిన కేటీఆర్ కూడా తన కుటుబం కోసం సమయం కేటాయిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ తన కుమారునితో దిగిన ఫోటో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు. “13 సంవత్సరాల కుమారుడు మీ కన్నా ఎత్తుగా ఉంటే.. తన తననుండి కావాల్సింది ఆత్మీయ ఆలింగనం” అంటూ హిమాన్షుని రెండు చేతులతో ఆలింగనం చేసుకున్న ఫోటో షేర్ చేశారు కేటీఆర్.
నిజమే కదా మన కళ్లముందు చిన్నపిల్లాడిలా ఆడుకున్న హిమాన్షు ఎంతగా ఎదిగాడో..
When you’re just thirteen son stands taller than you and all you want is a bearhug ? pic.twitter.com/fBp7N47jOc
— KTR (@KTRTRS) April 13, 2019