ఈ వారం థియేటర్/ ఓటిటి లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..

-

థియేటర్లో విడుదల అయ్యే చిత్రాలు..

 

యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం… కే జి ఎఫ్ 1 లో గరుడ మరణానంతరం ఏం జరిగింది? అనే ప్రశ్న కే జి ఎఫ్ చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.ఏప్రిల్ 14న ఈ ఉత్కంఠకు తెరపడనుంది.పార్ట్ 1 దేశవ్యాప్తంగాా ఘన విజయం అందుకోవడం, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి ప్రముఖులు కీలక పాత్రను పోషించడంతో కే జి ఎఫ్ 2 పై అంచనాలు పెరిగాయి.

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “బీస్ట్” చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. “అరబిక్ కుత్తు” పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది.

షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వంలో వస్తున్న చిత్రం “జెర్సీ” నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కి ప్రజల హృదయాన్ని హత్తుకున్న చిత్రం “జెర్సీ” ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.ఏప్రిల్ 14న రావాల్సిన ఈ సినిమా కే జి ఎఫ్ 2 రిలీజ్ ను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఓటీటీ వేదికగా విడుదలయ్యే చిత్రాలు..

ఆడవాళ్లు మీకు జోహార్లు.- ఏప్రిల్ 14 (సోనిలివ్)
దహనం.- ఏప్రిల్ 14 (ఎంఎక్స్ ప్లేయర్)
గాలివాన( వెబ్ సిరీస్)- ఏప్రిల్ 14 (జి 5)
బ్లడీ మేరీ.- ఏప్రిల్ 15( ఆహా)

Read more RELATED
Recommended to you

Latest news