మంత్రి పదవి రాని వారు ఏడుపులు, శోకాలు పెట్టొద్దు : కొడాలి నాని

-

ఏపీలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డవారు తీవ్ర అసంత్రుప్తి, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నవారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొన్నటి వరకు మంత్రులుగా ఉండీ.. ప్రస్తుతం మంత్రి పదవి దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకతోటి సుచరిత వంటి వారు రాజీనామాకు సిద్ధ పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. బాలినేని వర్గీయులైతే ప్రకాషం, బాపట్ల జిల్లాల్లో తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. బాలినేనికి లేని పదవి తమకు కూడా అక్కర్లేదంటున్నారు. 

ఇదిలా ఉంటే ఈ పరిణామంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. మంత్రి పదవి దక్కకపోవడాన్ని అవమానంగా భావించడం లేదని కొడాలి నాని అన్నారు.  మేము అందరం జగన్ సొంత మనుషులం, పార్టీకోసం ప్రభుత్వం కోసం అందరూ కట్టుబడి ఉండాలని నాని అన్నారు. వీళ్లు నా మనుషులు అనుకుని వీళ్లను పదవి నుంచి తీసేసినా బాధ పడరని జగన్ భావించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి పదవి రాని వారు ఏడుపులు, శోకాలు పెట్టవద్దని సూచించారు. జగన్ వెనక సైనికుల్లా నిలబడదాం… మనకెవరికి జగన్ అన్యాయం చేయరని కొడాలి నాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news