మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో యోగీ బుల్డోజర్ల మాదిరిగానే… నిన్న మధ్యప్రదేశ్ లో మత కలహాలకు పాల్పడిన వారికి తగిన బుద్దిచెప్పేందుకు ‘బుల్డోజర్ల’ను రంగంలోకి దింపారు. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా ఊరేగింపు జరుగుతన్న సమయంలో మరోవర్గం వారు రాళ్లు రువ్వారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో నిన్న అల్లర్లకు పాల్పడ్డ వారిని గుర్తించారు పోలీసులు. 84 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లర్లకు పాల్పడ్డ వ్యక్తుల ఇళ్లను కూల్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖర్గోన్ నగరంలో అత్యంత సున్నితమైన చోటీ మహల్ టాకీస్ ప్రాంతంలో భారీ భద్రత నడుమ అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను కూల్చివేశారు.
ఆదివారం ఖర్గోన్ నగరంలో శ్రీరాముడి ఊరేగింపు జరుగుతన్న సమయంలో వేరే వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వారు. ఈ పరిణామం పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఖర్గోన్ ఎస్పీ సిద్ధార్గ్ చౌదరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆరుగురు పోలీసులతో సహా 24 మంది గాయపడ్డారు. నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఘర్షణకు కారణమైన 84 మందిని అరెస్ట్ చేశారు.
Khargone Me #Buldozer Baba Ki Teyari Shuru… #khargone khargone #RamNavami #MadhyaPradesh #Violence #खरगौन #MP10 #रामनवमी pic.twitter.com/TpR9US793B
— काला साया (@iamakki19) April 11, 2022