జగనుది ఛాయ్, బిస్కెట్ కేబినెట్టేనంటూ యనమల రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్నది ఛాయ్, బిస్కెట్ కెబినెట్ అని.. గత కెబినెట్ పప్పెట్ కెబినెట్టు అయితే.. ఇప్పుడు ఛాయ్ జగన్ కెబినెట్ పప్పెట్ కెబినెట్ అంటూ పంచ్ వేశారు. జగన్ కెబినెట్టులో మంత్రులకు స్వేచ్ఛ లేదని ఫైర్ అయ్యారు. జగన్ కిచెన్ కెబినెట్టులోనో.. సలహదారుల బృందంలోనో బీసీలు ఎందుకు లేరు..? అని నిలదీశారు.
నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కెబినెట్టులో బీసీలకు ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. ప్రాధాన్యత, పెత్తనం లేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారు..? అని ఫైర్ అయ్యారు. ఈ కెబినెట్లో బడుగులకు ఎలాంటి ప్రాధాన్యత లేదని చురకలు అంటించారు. బడుగులకు ఎంత మందికి చోటు కల్పించామనే దాని కంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేదే ముఖ్యమని చెప్పారు. జగన్ కెబినెట్టులో పాత బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసేసి.. కొత్త వారికి ఇచ్చారని ఎద్దేవా చేశారు యనమల రామకృష్ణ.