BREKING: అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..

-

ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంతో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన అనంతరం ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఇందులో భాగంగా 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.అక్బరుద్దీన్ పై రెండు కేసులు నమోదయ్యాయి.నిర్మల్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, తరువాత హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడినందుకు అక్బరుద్దీన్ పై ఐపిసి120 బి, 153 ఏ, 295, 296, 188 సెక్షన్ల కింద సుమోటోగా పోలీసులు కేసులు పెట్టారు.

అయితే తాజాగా  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై ఉన్న కేసులను కొట్టివేసిన స్పెషల్ సెషన్స్ జడ్జి.ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయరాదు అని అన్నారు.కేసును కొట్టి వేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దు అని సూచించింది.అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రసంగంపై మందలించిన కోర్టు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదు అంటూ అక్బర్ న్యాయవాదికి సూచించారు న్యాయమూర్తి.

 

Read more RELATED
Recommended to you

Latest news