మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి తాజాగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీనితో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అటవీ శాఖలో 1,668, అగ్నిమాపక శాఖలో 875, ఎక్సైజ్ శాఖలో 791 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదే విధంగా మిగిలిన శాఖల్లో కూడా ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అటవీ శాఖలోని 1,668 పోస్టులను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. ఎఫ్సీఆర్ఐకి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సహా 31 పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతిని ఇవ్వడం జరిగింది.
ఇది ఇలా ఉంటే అగ్నిమాపక శాఖలోని 875 పోస్టులు ఉండగా.. ఫైర్మెన్ పోస్టులు 610 ఉన్నాయి. అలానే స్టేషన్ హౌస్ ఆఫీసర్, డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను పోలీస్ నియామక మండలి భర్తీ చేయనుంది. అగ్నిమాపక శాఖలోని 14 జూనియర్ అసిసెంట్ పోస్టులను తీస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుళ్ల పోస్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలో 40 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఇక పోస్టులని వివరాలను చూస్తే..
మొత్తం ఖాళీలు: 3,334
అటవీశాఖ లో ఖాళీలు: 1,668
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 1,393
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 92
టెక్నికల్ అసిస్టెంట్: 32
జూనియర్ అసిస్టెంట్: 9
అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్స్: 18
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 14
జూనియర్ అసిస్టెంట్: 75
అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎఫ్సీఆర్ఐ): 21
అసోసియేట్ ప్రొఫెసర్ (ఎఫ్సీఆర్ఐ): 4
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: 2
ప్రొఫెసర్: 2
అసిస్టెంట్ కేర్ టేకర్: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్: 1
కేర్ టేకర్: 1
ఫీల్డ్ మేనేజర్: 1
లైబ్రేరియన్: 1
స్టోర్స్ మేనేజర్: 1
అగ్నిమాపక శాఖలో ఖాళీలు :875
స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 26
ఫైర్మెన్: 610
డ్రైవర్ ఆపరేటర్: 225
జూనియర్ అసిస్టెంట్: 14
ఎక్సైజ్ శాఖలో ఖాళీలు: 751
ఎక్సైజ్ కానిస్టేబుల్: 614
అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్: 8
జూనియర్ అసిస్టెంట్ (లోకల్): 114
జూనియర్ అసిస్టెంట్ (స్టేట్): 15
బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఖాళీలు: 40
అకౌంట్స్ ఆఫీసర్: 5
అసిస్టెంట్ అకౌంట్స్ అఫీసర్: 7
అసిస్టెంట్ మేనేజర్: 9
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్: 8
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 8
డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్: 3