దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సర్వీసులని అందిస్తోంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్బీఐ లో చాలా మంది ఖాతాని కలిగి వున్నారు. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ని తెలుసుకోవడం ఇప్పుడు ఈజీ.
అదే ఒకప్పుడు బ్యాంకు అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. తర్వాత ఏటీఎంలు రావడంతో బ్యాలెన్స్ ని ఈజీగా తెలుసుకోవచ్చు. దీని కంటే సింపుల్ గా మనం బ్యాలెన్స్ ని చూడచ్చు. అది ఎలానో ఇప్పుడే చూసేద్దాం.
ఎస్ఎంఎస్ పంపి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు:
ఈజీగా మొబైల్ నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ పంపి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. BAL అని టైప్ చేసి 09223766666 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపితే మీ బ్యాలెన్స్ ఎంతో తెలుస్తుంది. అయితే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారానే మెసేజ్ పంపాలి. ఒకవేళ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయనట్టైతే REGAccount Number అని టైప్ చేసి 09223488888 నెంబర్కు పంపించాలి.
మిస్డ్ కాల్ ద్వారా అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు:
రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. 09223766666/ 09223866666 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అప్పుడు బ్యాలెన్స్ మీకు మెసేజ్ వస్తుంది.
అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా నెంబర్ ద్వారా తెలుసుకోచ్చు:
ముందుగా MBSREG అని టైప్ చేసి 567676 లేదా 0922344000 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేయాలి. నెక్స్ట్ యూజర్ ఐడీ, ఎంపిన్ వచ్చిన తర్వాత *595# టైప్ చేసి బ్యాలెన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యాలి అంతే. లేదు అంటే మీరు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో లాగిన్ అయి ఎస్బీఐ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. లేదా ఏటీఎం కి వెళ్లి కూడా చూసుకోచ్చు.