ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆయిల్ రూ.6,000 గిఫ్ట్ వోచర్ ని ఇస్తోందా..?

-

తరచు మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక నకిలీ వార్త కనబడుతూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. నిజానికి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మకూడదు. ఈ ఫేక్ వార్తలను నమ్మారు అంటే అనవసరంగా మోస పోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో తరచూ ఫేక్ వార్తలు వస్తున్నా సరే చాలా మంది నమ్మి మోసపోతున్నారు. కాబట్టి ఇటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది.

ఇక తాజాగా ఒక వార్త వచ్చింది అయితే ఇందులో నిజం ఎంత..? నిజంగానే నిజమైన వార్తేనా లేదంటే ఫేక్ వార్తా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. అయితే మరి అందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియాలో ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. ఆరు వేల రూపాయల విలువగల గిఫ్ట్ కార్డ్స్ ని పొందొచ్చని ఆ మెసేజ్ లో ఉంది. అయితే నిజంగా ఇండియన్ ఆయిల్ ఆ మెసేజ్ ని పంపించిందా..? ఆరు వేల విలువగల గిఫ్ట్ కార్డు ఇండియన్ ఆయిల్ ఇస్తోందా అనేది చూస్తే… ఇది కేవలం ఫేక్ వార్త అని తెలుస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పేసింది. కాబట్టి అనవసరంగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోకండి నిజానికి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news