తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖల పై విఐపి బ్రేక్ దర్శనాల జారీని పున:ప్రారంభించింది టిటిడి పాలక మండలి.
ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేది నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టిటిడి. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ పూర్తికావడంతో మళ్లీ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి సిఫార్సు లేఖల స్వీకరణ పై టిటిడి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం… వీఐపీ బ్రేక్ దర్శనాలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి.
- తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85825 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 36146 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.4 కోట్లు