పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల కౌంటింగ్…. టీెఎంసీ, బీజేపీ మధ్య పోటీ

-

పశ్చిమ బెంగాల్ లోని ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఈ ఎన్నికలు సంబంధించి ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అయింది.  ఈరెండు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన ఇద్దరు ఈ ఎన్నికల్లో టీఎంసీ తరుపున పోటీ చేశారు. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అసన్ సోల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మాజీ బీజేపీ నేత, ప్రస్తుత టీఎంసీ శత్రుఘ్ను సిన్హా పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి అగ్నిమిత్ర పాల్ బరిలో నిలిచారు. మరోవైపు మాజీ కేంద్రమంత్రి, గతంలో బీజేపీ పార్టీలో ఉండీ ప్రస్తుతం త్రుణమూల్ కాంగ్రెస్ లో ఉన్న బాబుల్ సుప్రియో బల్లీ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

ఇటీవల ఈ ఎన్నికల వేళ భారీగానే హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలతో పాటు సెక్యురిటీ సిబ్బందిని టీఎంసీ కార్యకర్తలు చితకబాదారు. తాజాగా ఈరోజు కౌంటింగ్ వేళ ఎలాంటి సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బెంగాల్ ప్రజలు దీదీ వైపే ఉన్నారంటూ టీెఎంసీ నేత బాబుల్ సుప్రియో ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news