కరోనా పుట్టినిల్లు చైనా… కరోనాతో విలవిల్లాడుతోంది. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంభిస్తున్నా చైనాలో రోజు రోొజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతీరోజు 20 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చైనాలో వేగం విస్తరించడంతో నగరాలు లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి. తీవ్రమైన ఆంక్షల మధ్య ప్రజలు బిక్కుబిక్కున కాలం వెల్లదీస్తున్నారు. చివరకు ముద్దులు, కౌగిలించుకోకూడదని, భార్యభర్తలు వేరువేరుగా పడుకోవాలని అక్కడి కమ్యునిస్ట్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిందంటే.. కరోనా తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది.
ప్రస్తుతం చైనాలో 40 కోట్ల మంది ప్రజలు లాక్ డౌన్ ఆంక్షల గుప్పిట ఉన్నారు. ముఖ్యంగా వాణిజ్య నగరం అయిన షాంఘైలో మూడు వారాలుగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మొత్తం దేశంలోని 100 నగరాల్లో దాదాపు 87 చోట్ల కరోనా ఆంక్షలు కఠినంగా అమలు అవుతున్నాయి. బయటకు కేసుల సంఖ్య చెప్పకున్నా… చైానా ప్రభుత్వం మాత్రం కఠిన ఆంక్షలను పెడుతోంది.