తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సెప్టెంబర్ 2 ప్రగతి నివేదన సభకు తరలివచ్చే వారు టోల్ ప్లాజా దగ్గర టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు హెచ్ఎండీఏ ఆ ఒక్క రోజుకి సంబంధించి టోల్ ఫీజుని తెరాస పార్టీ నుంచి తీసుకోనున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ జనార్థన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. భారీ అంచనాలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ ఉదయం 2 నుంచి అర్థరాత్రి 12 వరకు టోల్ వసూలు చేయరు.. ట్రాక్టర్లు, నెమ్మదిగా వెళ్లే వాహనాలను ఔటర్ పై అనుమంతిచబోమని పేర్కొన్నారు.