బుల్లితెర మీద మహానటి విజయం

-

సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మహానటి. అశ్వనిదత్ సమర్పణలో ప్రియాంకా, స్వప్నలు ఈ సినిమా నిర్మించారు. సావిత్రి జీవిత కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. వెండితెర మీద అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా బుల్లితెర మీద కూడా రికార్డులు సృష్టించింది. స్టార్ హీరోల సినిమాలతో సమానంగా మహానటి టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది.

స్టార్ మాలో ప్రసారమైన ఈ సినిమా 20.16 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. ఈమధ్య బుల్లితెర మీద ఈ రేంజ్ టి.ఆర్.పి రేటింగ్ వచ్చిన సినిమాల్లో ఈ సినిమా క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమాతో బయోపిక్ సినిమాలకు ఓ కొత్త ఎనర్జీ వచ్చింది. పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది.

కీర్తి సురేష్ సావిత్రిగా నటించిన మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news