ఫ్యాక్ట్ చెక్: మరో పీఐబీ ఇండియా అకౌంట్ ని తీసుకొచ్చారా..? ఎమర్జెన్సీ కోసమేనా..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త వచ్చింది. అది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ అని ఒక అకౌంట్ ని తీసుకు వచ్చారు. అయితే పీఐబీ ఇండియా అనే ఒక ట్విట్టర్ ఎకౌంట్ ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ వేళల్లో ఉపయోగించడానికి మరొక ట్విటర్ అకౌంట్ ని తీసుకు వచ్చామని అంటున్నారు అయితే ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

సెకండరీ సపోర్టింగ్ ఎకౌంట్ అనేది ఏమి రాలేదు. ఎమర్జెన్సీ వేళల్లో దీనిని ఉపయోగించడం కోసం తీసుకొస్తున్నామంటూ వచ్చిన ట్విటర్ అకౌంట్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ అకౌంట్ ని పీఐబీ ఇండియా తీసుకురాలేదు ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇది కేవలం నకిలీ అని తేల్చేసింది కాబట్టి ఈ ట్విట్టర్ అకౌంట్ ని నమ్మకండి అనవసరంగా మోసపోవాల్సింది మీరే.

Read more RELATED
Recommended to you

Latest news