ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ ‘అణు’ బెదిరింపులు

-

ఓవైపు హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ను ఉద్దేశిస్తూ.. ఇరాన్ ఉనికి ప్రమాదంలో ఉందని అనిపిస్తే మాత్రం అణు బాంబులు తయారు చేసేందుకు కూడా వెనకాడబోమని ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడదని సుప్రీం లీడర్‌ సలహాదారు కమాల్‌ ఖర్రాజీ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు అణుబాంబు తయారీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న ఖర్రాజీ, కానీ, ఇరాన్‌ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం తమ సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఒక వేళ తమ అణుస్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడిచేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణ వాతావరణం ముదరిన వేళ ఈ ప్రకటన రావడం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ బాంబింగ్‌ చేయడం దీనికి కారణంగా నిలిచింది. దీంతో వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులను టెల్‌అవీవ్‌పైకి టెహ్రాన్‌ ప్రయోగించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news