తరచు మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త కనబడుతూనే ఉంటుంది. నిజానికి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నమ్మారు అంటే చిక్కుల్లో పడినట్లే. అయితే తాజాగా పరీక్షలకు సంబంధించి ఒక వార్త వచ్చింది.
అయితే మరి అది నకిలీ వార్తా లేదంటే నిజమైన వార్తా అనేది ఇప్పుడు చూద్దాం. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షలు పోస్ట్ పోన్ చేసినట్లు వార్త వచ్చింది. అయితే ఈ పరీక్షలను 9 జూలై, 2022 న నిర్వహించినట్లు ఆ వార్తలో ఉంది. అయితే మరి నిజంగానే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ పీజీ పరీక్షలని పోస్ట్ పోన్ చేసిందా..?
A #FAKE notice issued in the name of the National Board of Examinations claims that the NEET PG exam has been postponed & will now be conducted on 9th July 2022.#PIBFactCheck
▶️ The exam has not been postponed.
▶️ It will be conducted on 21 May 2022 only. pic.twitter.com/790mTsZypM
— PIB Fact Check (@PIBFactCheck) May 7, 2022
21 మే, 2022 జరగాల్సిన పరీక్ష 9 జూలై, 2022 కి వాయిదా వేసారా..? ఇందులో నిజం ఎంత అనేది చూస్తే.. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఇది కేవలం నకిలీ వార్త అని తెలుస్తోంది. 9 జూలై, 2022 కి ఈ పరీక్ష పోస్ట్ పోన్ అవ్వలేదు ఈ పరీక్షలు 21 మే, 2022న నిర్వహించనున్నారు. ఇది నకిలీ వార్త కాబట్టి విద్యార్థులు గమనించడం మంచిది. అనవసరంగా నకిలీ వార్తలను నిజం అనుకోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది నకిలీ వార్త అని తేల్చేసింది.