అంజలీ దేవి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల పక్కన పౌరాణిక కథలలో ఎక్కువగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన అంజలీదేవి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది అంతే కాదు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి హీరోలు కృష్ణుడు రాముడు లాంటి వేషం కట్టినప్పుడు వారి సతీమణులు గా అంజలీదేవి నటించిన ప్రేక్షకులను అలరించింది. ఇక అంజలీదేవి కెరీర్ విషయానికి వస్తే భారతీయ నటి గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటిగా ప్రవేశించక ముందు మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఇక ఈమె కేవలం నటి మోడల్ మాత్రమే కాదు తెలుగు మరియు తమిళ చిత్రాలలో నిర్మాత గా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.లవకుశలో దేవి సీత పాత్రతో పాటు సువర్ణ సుందరి మరియు అనార్కలి వంటి చిత్రాలలో టైటిల్ పాత్రలకు ఆమె బాగా పేరు తెచ్చుకున్నారు. .అంజలీ దేవి భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ ,తూర్పు గోదావరి జిల్లా , పెద్దాపురంలో అంజమ్మగా జన్మించింది . నాటకాల్లో నటిస్తున్నప్పుడు తన పేరును అంజనీ కుమారిగా మార్చుకుంది. తర్వాత దర్శకుడు సి.పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు.సినిమాల్లోకి రాకముందు ఆమె థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేసేవారు. ఆమె తొలి చలనచిత్ర పాత్ర 1936లో ” రాజా హరిశ్చంద్ర” లో లోహితస్వ పాత్రలో నటించింది. ఆమె కథానాయికగా మొదటి చిత్రం 1940 లో ఎల్‌వి ప్రసాద్‌చే కష్టజీవి , కానీ మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆ చిత్రం నిలిపి వేయడం జరిగింది. తరువాత సి.పుల్లయ్య ఆమెను కనిపెట్టి, గొల్లభామ (1947) లో మోహినిగా నటించే అవకాశాన్ని ఇచ్చాడు . ఆమె నటనా సామర్థ్యం.. మోములో పలికించే హావభావాలు చూసి ఆమె 1947లో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది.ఆమె చివరికి 350కి పైగా చిత్రాలలో నటించింది. ఇకపోతే అంజలి దేవి పేరు వినగానే ప్రతి ఒక్కరికి సీతాదేవి గుర్తుకొస్తుంది. ఇక N.T.రామారావు తో కలసి అంజలీదేవి జై లవకుశ సినిమాలో సీత పాత్ర వేసి ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించింది.. ఎంతలా అంటే షూటింగ్ మొత్తం ఒకసారి బయటకు వెళ్ళిన అంజలి దేవి కారు దిగుతుండగా ఆమెని చూసి అక్కడున్న ప్రజలంతా నిజంగా సీతాదేవి మన వద్దకు వచ్చింది అంటూ ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలంతా మోకరిల్లి ఆమెకు దండాలు పెట్టడం మొదలు పెట్టారట. ఇక అది చూసి ఆమె తన మనసు ఉప్పొంగిపోయింది అని ఒక పత్రిక కూడా వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లో నటీనటులు ఎంతలా నటించేవారో మనం అర్థం చేసుకోవచ్చు.