ఐదేళ్లలో లక్ష కోట్లు అప్పు చేశారు : కింజరాపు అచ్చెన్నాయుడు

-

గత ఐదేళ్లు రైతులను మబ్బి పెట్టారు.. గతంలో మాదిరిగానే వైసిపి అబద్ధాలు చెబుతుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం చేశారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లలో లక్ష కోట్లు అప్పు చేశారు. కేంద్రం ఇచ్చిన పథకాలు కూడా వైసిపి వినియోగించలేదు. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టింది. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం.

నేటివరకు 21 లక్షల మెట్రిక్తున్నుల ధాన్యం కొనుగోలు చేసి మూడు లక్షల ఇరవై వేల మంది రైతులకు సొమ్మును ఖాతాలో జమ చేసాం. యాంత్రికరణకు అధిక ప్రార్ధన తీస్తూ 24 % ఉన్న తేమను 14% కు తగ్గించాం. రాష్ట్రంలో 4600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తాం. 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారు. 117 జీఓ రద్దు చేస్తాం. జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాన్నం భోజనం పధకం ప్రారంభిస్తాం. విద్యా కిట్లు ఇస్తున్నాం. మూలపేట పోర్టులో శరవేగంగా పనులు. జూన్ నాటికి మొదటి షిప్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 5 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్ తీసుకుంటాం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news