ఏపీలో టెన్త్ పేపర్ల లీకుల కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీంతో.. నారాయణ అరెస్ట్‌పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు వైసీపీ ప్రభుత్వంపై గుప్పిస్తున్నారు. అయితే తాజాగా.. టీడీపీ నేత జీవీ అంజనేయులు పల్నాడు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీమంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ చేశారన్నారు. ప్రజల దృష్టిని మరల్చేంచుదుకే సీఎం జగన్ ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్ట్ లకు దిగుతుందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతు కుటుంబం సంతోషంగా లేని ఆయన మండిపడ్డారు. పేపర్ లీక్ కాలేదని ఒక పక్క విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారని, మరోపక్క పేపర్ లీక్ అయిందనే కారణంతో నారాయణని అరెస్ట్ చేశారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై వేలాది మంది రైతులతో కలిసి రేపు ఉదయం నిరసన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రైతుల సమస్యలు పరిష్కరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేస్తామని జీవి ఆంజనేయులు తెలిపారు.