ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ఢీ విన్నర్, డ్యాన్స్ మాస్టర్ యశ్ (యశ్వంత్)

-

తన డ్యాన్స్ తో ఢీ 10 టైటిల్ కొట్టిన యశ్వంత్ అలియాస్ యశ్ తన చిన్ననాటి స్నేహితురాలు వర్షని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొన్నామధ్య వీరి ఎంగేజ్మెంట్ పూర్తయిందని తెలియగా శనివారం నాడు యశ్, వర్షల మ్యారేజ్ జరిగింది. ఓ సాధారణ డ్యాన్సర్ నుండి ఢీ టైటిల్ కొట్టి ఇప్పుడు సినిమాల్లో డ్యాన్స్ కంపోజ్ చేసే మాస్టర్ గా ఎదిగిన యశ్ టాలెంట్ ఏంటో అందరికి తెలిసిందే.

యశ్ ఉన్నాడు అంటే అతనైనా అతని కంటెస్టంట్ అయినా డ్యాన్స్ దుమ్మురేపాల్సిందే. ఇక తన పెళ్లి వివరాలు చెబుతూ వర్ష తన చిన్ననాటి స్నేహితురాలని.. కాలేజ్ మెట్ కూడా.. ఇద్దరం లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇంట్లో వాళ్లని ఒప్పించాలని అనుకున్నాం అలానే ఇద్దరం ఎవరి ఫీల్డ్ లో వారు సెటిల్ అయ్యాం. అందుకే ఇంట్లో వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నాడు యశ్. వర్ష ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తుందట. మొత్తానికి అటు కెరియర్ లో ఇటు లైఫ్ లో యశ్ మాస్టర్ ఆల్ హ్యాపీస్ అన్నమాట.

 

View this post on Instagram

 

??

A post shared by Yashwanth Master (@yashwanthmaster) on

Read more RELATED
Recommended to you

Latest news