మటన్ కాని మటన్.. చికెన్ కాని చికెన్.. కోళ్లు, గొర్రెలు చంపకుండానే చికెన్, మటన్.. అహింస మీట్ గురించి మీకు తెలుసా..!

ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ లేనిది ముద్ద ముట్టని వారు ఎంతమందో. సిటిల్లో బిరియానీలు.. ఊళ్లల్లో అయితే ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ షాపుల దగ్గర జనాలు లైన్ కట్టేస్తారు. ఇంత చేసినా ఫ్రెష్ చికెన్, మటన్ దొరుకుతుంది అన్న నమ్మకం కూడా లేదు. అదికూడా జీవిత హింస అయినా ఎక్కువ జనాలు ఇష్టపడుతున్నారని ప్రభుత్వం కూడా ఏమి అనలేని పరిస్థితి. అయితే ఎలాంటి జీవ హింస లేకుండా మటన్, చికెన్ దొరికితే..

అదెలా అనుకోవచ్చు.. జంతువుల మూల కణాల ద్వారా మాంసాన్ని తయారు చేసేందుకు సి.సి.ఎం.బి సన్నద్ధమవుతుంది. కోళ్లను, గొర్రెలను చంపకుండానే వాటి మాంసాన్ని తినొచ్చు. సిసిఎంబి శాస్త్రవేత్తలు ఇందుకోసం పరిశోధనలు మొదలుపెట్టారు. ఇలాంటి మాంసాన్ని తయారు చేసే రెండు సెంటర్స్ ఈమధ్యనే హైదరాబాద్ సిసిఎంబి, ఎన్.ఆర్.సి.ఎం సంస్థలు కలిసి ప్రాజెక్ట్ చేపట్టాయి.

జంతువులను వధించి దాన్ని ఆహారంగా తీసుకోవడం తప్పని.. హింస చట్టరీత్యానేరం అయినప్పటికి ప్రజల అవసరార్ధం దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే ఈ మాంసానికి అసింహా మీట్ అని పేరు పెట్టారు. జంతువుల మూల కణాల నుండి ఏర్పరచే ఈ మటన్, చికెన్ అచ్చం సాధారణ చికెన్, మటన్ లానే ఉంటుందట. అంతేకాదు ఈ మాంసానికి ఎలాంటి ఎముకలు, కొవ్వు ఉండే ఆస్కారం లేదని తెలుస్తుంది. ఫుల్ ప్రొటీన్స్ తో తయారు చేయబడే ఈ మాంసాన్ని ఫ్యూచర్ ఆఫ్ ప్రొటీన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ గా ఈ ప్రొడక్ట్ డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.